ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నికైన బోడపట్ల సతీష్ రాజ్ గౌడ్ .
తిరుమలాయపాలెం జూలై 24 (నమస్తే న్యూస్)
తిరుమలాయపాలెం మండలం లోని ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ స్ అసోసియేషన్ ఎన్నిక జరగగా దమ్మాయిగూడెం గ్రామానికి చెందిన బోడపట్ల సతీష్ రాజ్ గౌడ్ మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైనారు కార్యదర్శిగా దారమల్ల శంకర్ కోశాధికారిగా షేక్ జావిద్ భాష లను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నిక ప్రక్రియ నిర్వహించిన నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ను అధ్యక్షులు బోడపట్ల సతీష్ రాజ్ గౌడ్ మాట్లాడుతూ మండలంలోని ఫోటో అండ్ వీడియో వృత్తినే నమ్ముకొని పనిచేస్తున్న మిత్రులందరికీ ఏ కష్టం వచ్చినా తను వెన్నంటే ఉంటానని ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు అందరికీ వర్తించే విధంగా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన తెలిపారు ఈ కార్యక్రమం లో సీనియర్ ఫోటోగ్రాఫర్ మాజీ అధ్యక్షులు రామనబోయిన నాగరాజు ఎల్ ప్రవీణ్ ఎల్ కిషోర్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.


