వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టండి.
-ఎంపీడీఓ షేక్ శిలా సాహెబ్
తిరుమలాయపాలెం,జులై 22 ( నమస్తే న్యూస్ )
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తిరుమలాయపాలెం మండల కేంద్రంలో ప్రభుత్వ అధికారులకు , గ్రామ సర్పంచులకు , కార్యదర్శులకు , వివిధ శాఖల సిబ్బందికి వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) షేక్ శిలార్ సాహెబ్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఎంపీడీఓ షేక్ శిలా సాహెబ్ మాట్లాడుతూ,ఎల్నినో భావంతో ఈ సంవత్సరంవర్షాభావ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి తాగునీరు, పశువుల మేత, ఉపాధి హామీ పనులు, సాగునీటి నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
గ్రామస్థాయిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.ప్రతి గ్రామంలో ఈ నెల 29వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించి, వర్షాభావ పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, గ్రామాల అవసరాలను గుర్తించి సంబంధిత అధికారులకు నివేదించాలని ఆదేశించారు. తాగునీటి వనరులను సంరక్షించడం, నీటి వృథాను అరికట్టడం, అవసరమైన చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.విపత్కర పరిస్థితులు ఎదురైతే ప్రజలకు తక్షణమే అవసరమైన సేవలు అందేలా అన్ని శాఖలు సిద్ధంగా ఉండాలని, ప్రతి అధికారి తన పరిధిలోని గ్రామాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి నా రెడ్డి సీతారాం రెడ్డి మాట్లాడుతూ తిరుమలయపాలెం మండలంలోని రైతాంగం ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు ఏర్పడినందునఎల్నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వలన రైతులు పంటల సాగు విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అందుకు అనుగుణంగా వ్యవసాయంలో నూతన వరవడిని అలవాటు చేసుకోవాలని ప్రత్యామ్నాయ పంటలను వేస్తూ పెసలు అపరాలు, కందులు వేరుశనగలు బొబ్బర్లు అలసందల వంటి వీటితోపాటు తక్కువ ఖర్చుతో కూడినటువంటి కూరగాయల సేద్యం ఆకుకూరలు వంటివి సాగు చేసుకోవాలని తక్కువ నీటి వనరులతో ఎక్కువగా పంటలు వచ్చే విధంగా వ్యవసాయాన్ని మార్చుకోవాలని సూచించారు. ముందు కూడా వర్షాలు కురుస్తాయి అనే నమ్మకం లేదని ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం వలన కరువు పరిస్థితులు నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ చెప్తున్నదని దానికి అనుగుణంగానే ప్రత్యామ్నాయ వ్యవసాయ సాగులు చేయాలని ఈ సందర్భంగా తెలిపినారు. ఇరిగేషన్ ఈఈ రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం ఇప్పటివరకు వర్షాకాలమ్ ప్రారంభమై 40 రోజులు దాటినా గాని ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదని ప్రాజెక్టులలో ఎక్కడ కూడా ఆశించిన స్థాయిలో నీరు లేదని ప్రస్తుతం పాలేరు రిజర్వాయర్లో మనకు తాగునీరుకు సరిపడా నీరు మాత్రమే ఉన్నదని అది వ్యవసాయానికి సరిపడా లేదని మనకు పైన ఉన్న బ్యారేజీలలో నీరు పూర్తిగా డెడ్ స్టోరేజ్ లో ఉందని ఈ సంవత్సరం పూర్తిస్థాయి పంటలకు నీరు అందించే పరిస్థితి లేదని రైతులు కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మెట్ట పంటలు సాగు చేసుకోవాలని తక్కువ నీరుతో ఎక్కువ సేద్యం అయ్యే విధంగా చూడాలని బావులు బోర్లలో కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు మున్ముందు ఇదే పరిస్థితి ఉంటే ఉండకపోవచ్చు అని దానిని గుర్తించి రైతులు పంటలు సాగు చేసుకోవాలని ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వర్షం నమోదు కాలేదని తెలిపినారు.ఈ సందర్భంగా ఉద్యాన శాఖ వ్యవసాయ అధికారి అపర్ణ మాట్లాడుతూ… వాతావరణంలో మార్పుకు అనుగుణంగా తెలంగాణలో రైతాంగం నూతన పద్ధతులను అలవర్చుకోవాలని ఉద్యాన పంటల సాగుకు మొగ్గు చూపాలని నిత్యం ప్రజలకు అవసరమయ్యే కూరగాయలు ఆకుకూరల పంటలు సాగు చేసి రైతులు అధిక మొత్తంలో లాభాలు ఆశించాలని బిందు సేద్యం ద్వారా తక్కువ నీరుతో ఎక్కువ పంటలు పండించుకోవచ్చని ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో అందించే పంటలపై మొగ్గు చూపాలని ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు ఉన్నందున మిరప తోటలు వేసే రైతులు వేయకుండా ఉంటే మంచిదని మిరప తోటలో వేసి రైతులు నష్టపోవద్దని మిరప తోటలకు బదులు కూరగాయల పంటల సాగు పండ్ల పంటల సాగు చేసుకుంటే రైతులు లాభపడతారని తెలియజేసినారు. రైతులకు మరీ మరీ ఈ సంవత్సరం మిర్చి సాగు చేయదని ఉద్యాన శాఖ అధికారి అపర్ణ కోరినారు.ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులు, పిడిఓ షేక్ సిలార్ సాహెబ్, ఎమ్మార్వో లూధర్ విల్సన్, వ్యవసాయ అధికారి నా రెడ్డి సీతారాం రెడ్డి, ఉద్యాన పంటల వ్యవసాయ అధికారిని అపర్ణ, ఇరిగేషన్అధికారి ఈఈ బాణాల రమేష్ రెడ్డి, పశుసంవర్ధక సుబ్లేడ్ క్లస్టర్ డాక్టర్ షేక్ జానీ, పసిసంవర్ధక తిరుమలయపాలెం క్లస్టర్ డాక్టర్లు, ఎలక్ట్రిసిటీ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు, గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ, పశుసంవర్ధక, విద్యుత్, తాగునీటి, వైద్య, రెవెన్యూ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.




