- నీళ్లు అడిగి బంగారు గొలుసు అపహరణ.
- అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక.
గూడూరు, జూన్ 27 (నమస్తే న్యూస్):
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గూడూరు పోలీసులు సూచించారు. ఇటీవల బ్రాహ్మణపల్లి గ్రామంలో ఓ వృద్ధురి ఇంటి వద్ద జరిగిన గొలుసు చోరీ ఘటన నేపథ్యంలో అనుమానితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం, ఇద్దరు వ్యక్తులు ఇంటి వద్దకు వచ్చి తాము తెచ్చుకున్న వాటర్ బాటిల్లో మంచినీళ్లు పోయాలని కోరారు. సుమారు 80 ఏళ్ల వృద్ధురాలు నీళ్లు పోస్తున్న సమయంలో, వారిలో ఒకరు ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడును తెంపుకుని పరారైనట్లు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన అనుమానితుల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. ఫోటోల్లో ఉన్న వ్యక్తుల గురించి ఎవరికైనా సమాచారం లేదా ఆచూకీ తెలిసినా, ఎక్కడైనా కనిపించినా వెంటనే గూడూరు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు తగిన పారితోషికం కూడా అందజేస్తామని పోలీసులు తెలిపారు.
అపరిచితులు ఇంటి వద్దకు వచ్చి నీళ్లు, సహాయం లేదా ఇతర కారణాలతో మాట్లాడే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వృద్ధులు ఒంటరిగా ఉన్న ఇళ్లలో అపరిచితులను జాగ్రత్తగా గమనించాలని, ఏదైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని గూడూరు పోలీసులు విజ్ఞప్తి చేశారు.అనుమానిత వ్యక్తులు గాని పై ఫోటోలో ఉన్న వ్యక్తులు గాని కనిపిస్తే,లేదా వారి వివరాలు తెలిస్తే సీఐ గూడూరు: 8712656960,ఎస్ఐ గూడూరు: 8712656962,గూడూరు పోలీస్ స్టేషన్: 8712656963 లకు తెలియచేయాలని సూచించారు.
