భువనగిరి (ఆగస్టు 08) నమస్తే న్యూస్ :యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరు, ఆత్మకూరు, మోత్కూరు, చౌటుప్పల్ మరియు నారాయణపూర్ మండలాల్లో 8 నూతన మీసేవ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులకు శనివారం భువనగిరి పట్టణంలోని SLNS డిగ్రీ కళాశాలలో వ్రాత పరీక్ష నిర్వహించారు.మీసేవ సెంటర్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో మొత్తం 209 మందికి హాల్ టికెట్లు జారీ చేయగా, 166 మంది అభ్యర్థులు వ్రాత పరీక్షకు హాజరయ్యారు. పరీక్షా ప్రక్రియను సంబంధిత అధికారులు పర్యవేక్షించారు.జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీ టి. నాగిరెడ్డి గారి పర్యవేక్షణలో వ్రాత పరీక్షను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా, పారదర్శకంగా మరియు సజావుగా నిర్వహించారు.అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా కేంద్రంలో అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. పరీక్షా ప్రక్రియ మొత్తం నిబంధనలకు అనుగుణంగా నిర్వహించారు.ఈ పరీక్ష నిర్వహణ లొ EDM సాయి, రెవిన్యూ ఇన్స్పెక్టర్ సైదా పాల్గొన్నారు.

