ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వ ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం,ఆగస్టు 6 (నమస్తే న్యూస్ )
తెలంగాణ సిద్ధాంతకర్త, విద్యావేత్త, తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శకులు ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల, పిండిప్రోలులో గురువారం ఘనంగా నివాళులర్పించారు.కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ చేసిన త్యాగాలు, సేవలు, ఆలోచనలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విద్యార్థులు ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.అనంతరం తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల కోసం అందజేసిన ఉచిత నోట్‌బుక్స్‌ను కళాశాల విద్యార్థులందరికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆనందాన్ని నింపగా, ప్రభుత్వం అందిస్తున్న విద్యా ప్రోత్సాహక చర్యలను అధ్యాపకులు అభినందించారు ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ నారాయణరావు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్‌కు ఘనంగా నివాళులర్పించారు.కార్యక్రమం అనంతరం విద్యార్థులు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, విద్యా విలువలను కాపాడేందుకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.



