తిరుమలాయపాలెం,ఆగస్టు 5 (నమస్తే న్యూస్)
మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో బుధవారం తల్లిపాల వారోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కవిత హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.బిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలే శ్రీరామరక్ష: సీడీపీఓ కవితఈ సందర్భంగా సీడీపీఓ కవిత మాట్లాడుతూ, పుట్టిన ప్రతి బిడ్డకూ తల్లిపాలు అందించడం ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. బిడ్డ పుట్టిన గంట లోపు ఇచ్చే ముర్రుపాలు పసిపిల్లలకు మొదటి వ్యాధి నిరోధక టీకా లాగా పనిచేస్తాయని వివరించారు. కనీసం ఆరు నెలల వరకు బిడ్డకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, దీనివల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగి భవిష్యత్తులో ఎలాంటి వ్యాధులు దరిచేరవని పేర్కొన్నారు. వీటితో పాటు బాలింతలు, గర్భిణులు తమ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పౌష్టికాహారం తీసుకోవాలని ఆమె సూచించారు.ఘనంగా అన్నప్రాసన కార్యక్రమంవారోత్సవాల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో ఇద్దరు చిన్న పిల్లలకు సీడీపీఓ మరియు ఇతర అతిథులు చేతుల మీదుగా అత్యంత వేడుకగా ‘అన్నప్రాసన’ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులకు మొదటిసారిగా ఘనాహారాన్ని తినిపించి, వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తల్లులకు వివరించారు.కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు ఈ విజయవంతమైన కార్యక్రమంలో సీడీపీఓ కవితతో ఐసిడిఎస్ సిడిపిఓ కవిత సూపర్వైజర్ సావిత్రి ఏఎన్ఎం నాగలక్ష్మి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి అంగన్వాడి టీచర్ ఇప్పల గీత పదముత్తు స్వరూప సెక్టార్ సూపర్వైజర్ సావిత్రి, స్థానిక ఏఎన్ఎం , ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు, ఆయా ఆశా కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గర్భిణులు, బాలింతలు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

