- పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు.. మండలవ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం
- ఆరోగ్యవంతమైన బాల్యం కోసం ఆల్బెండజోల్ మాత్రలు.. నర్సింహులపేట మండలంలో విస్తృత కార్యక్రమం.
- నులిపురుగుల నివారణే లక్ష్యం.. 1వ సంవత్సరం నుంచి 19 సంవత్సరాల పిల్లలకు ఆల్బెండజోల్ పంపిణీ
- పోషకాహార లోపం, రక్తహీనత నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు.. తల్లిదండ్రులకు వైద్యుల విజ్ఞప్తి
నర్సింహులపేట, జూలై 13 (నమస్తే న్యూస్)
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నర్సింహులపేట మండలంలో విస్తృత స్థాయిలో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని జెడ్పీపీహెచ్ఎస్, టీఎస్ మోడల్ స్కూల్, కేజీబీవీ, ఎంపీపీఎస్ పాఠశాలలతో పాటు అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఒక సంవత్సరం నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను వైద్య సిబ్బంది వేయించారు.పిల్లల్లో నులిపురుగుల నివారణతో పాటు వారి ఆరోగ్యవంతమైన ఎదుగుదలే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వైద్యాధికారులు తెలిపారు. నులిపురుగుల వల్ల పోషకాహార లోపం, రక్తహీనత, శారీరక బలహీనత, తరచూ అలసట, శారీరక ఎదుగుదలలో జాప్యం, మానసిక వికాసంపై ప్రతికూల ప్రభావం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. క్రమం తప్పకుండా ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను నివారించి పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చని వివరించారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ కవిత, సూపర్వైజర్ సుజాత, ఏఎన్ఎం ప్రసన్నకుమారి, ఎంఎల్హెచ్పీ అన్వేష్, టీఎస్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీ ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు సునీత, కృష్ణవేణి, ఆశా కార్యకర్తలు వెంకటలక్ష్మి, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.


