గ్రానైట్‌ని తప్పించబోయి బయో డీజిల్ ట్యాంకర్ బోల్తా
నేల పాలైన బయో డీజిల్.
దంతాలపల్లి,జూలై 4(నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బీరిశెట్టి గూడెం–దాట్ల క్రాస్ రోడ్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం వైపు నుంచి వస్తున్న బయో డీజిల్ ట్యాంకర్ ఎదురుగా గ్రానైట్‌ని తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో ట్యాంకర్ రోడ్డు పక్కకు బోల్తా పడింది.ప్రమాదంలో ట్యాంకర్లో ఉన్న బయో డీజిల్ మొత్తం నేలపాలైంది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం కారణంగా కొంతసేపు ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



