దంట్లకుంట తండా పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తా:
సర్పంచ్ అరుణ సోమ నాయక్
మరిపెడ(జూన్ 08)నమస్తే న్యూస్:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం మరిపెడ మండలం మూలమర్రి తండా గ్రామ పంచాయతీలో సర్పంచ్ అరుణ సోమ నాయక్ నేతృత్వంలో విజయవంతంగా సాగుతోంది. 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా గ్రామంలో మౌలిక వసతుల కల్పన, పారిశుధ్య మెరుగుదలే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు.సోమవారం సర్పంచ్ అరుణ సోమ నాయక్ అధ్యక్షతన ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు.జీపీ కార్యదర్శితో కలిసి సర్పంచ్ గ్రామ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.ప్రజలు తమ వినతులను నేరుగా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.ప్రజా సమస్యలను,వినతులను అధికారులు స్వీకరించారు.పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోవడం,సీసీ రోడ్ల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపడం వంటి చర్యలు చేపట్టారు. “మన గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం.గ్రామసభల ద్వారా ప్రతి సమస్యను గుర్తించి పారదర్శకంగా పరిష్కరిస్తాం” అని సర్పంచ్ అరుణ సోమ నాయక్ తెలిపారు.లబ్ధిదారుల జాబితా సవరణ ప్రక్రియపై కూడా సర్పంచ్ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ గ్రామ సభలో పంచాయతీ కార్యదర్శి,ఉప సర్పంచ్,వార్డు సభ్యులు,ఏఎన్ఎం,ఆశా కార్యకర్తలు,మహిళా సంఘాల నాయకులు,గ్రామ పెద్దలు,యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు…
