నమస్తే మానుకోట న్యూస్ నర్సింహులపేట
ధనార్జనే ధ్యేయంగా కొందరు పెర్టిలైజర్ వ్యాపారులు నాసిరకం పెసర విత్తనాలను రైతులకు అంటగట్టి నిలువునా ముంచుతున్నా, పట్టించుకునే వారే కరువైనారు షాపు యజమానులతో వ్యవసాయ అధికారులు చేతులు కలిపి రైతులకు విత్తనాల నాణ్యత విషయంలో వ్యవసాయ అధికారులు విఫలమవుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు
నర్సింహులపేట మండల కేంద్రములోని అగ్రోస్ రైతు సేవా కేంద్రంలో 4 KGల పెసర విత్తనాల బ్యాగు 550రూపాయల చొప్పున విత్తనాలు కొనుగోలు చేసి జయపురం, పడమటిగుడెం, కొమ్ములవంచ పలు గ్రామాల ప్రజలు మోసపోయారు
నాణ్యత లేని పెసర చెట్లు ఏపుగా పెరిగిన సక్రమంగా పూత, కాత రాకపోవడంతో పాటు తెగుళ్ళు సోకి కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు నాసిరకం విత్తనాల కారణంగా పెసరపంట దిగుబడి గణనీయంగా తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరువ తీసుకుని నష్టపరిహారం ఇప్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు


