శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ బానోత్ కొండయ్య..
నమస్తే న్యూస్/డోర్నకల్ నియోజకవర్గం రతినిధి:
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని నేతవత్ పర్కజాల తండా గ్రామపంచాయతీలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభకు నూతన ఇంచార్జి ఎంపీఓ శ్రీనివాస్ హాజరయ్యారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బానోత్ కొండయ్య, అంగన్వాడీ టీచర్ బానోత్ కవిత ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గ్రామపంచాయతీ అభివృద్ధికి అధికారులు,ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.గ్రామ అభివృద్ధి,పరిశుభ్రతతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని,ప్రజల అవసరాలు,గ్రామ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.గ్రామపంచాయతీ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల సహకారం అవసరమన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు,అంగన్వాడీ సిబ్బంది,పంచాయతీ సిబ్బంది,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు..
