సీరోల్, అక్టోబర్ 03(నమస్తే న్యూస్)మహబూబాబాద్ జిల్లా లో విషాద ఘటన చోటుచేసుకుంది. సీరోల్ మండలం కాంపల్లి గ్రామ శివారులోని పల్లెగూడెం చెరువు సమీపంలో మంద చంద్రశేఖర్ (బాబు) (49) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో ఆయన మృతదేహాన్ని గుర్తించినట్లు సమాచారం.ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. చంద్రశేఖర్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
