బచ్చోడు, అక్టోబర్ 4 (నమస్తే న్యూస్)
: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున బచ్చోడు గ్రామపంచాయతీ పరిధిలోని బచ్చోడు గ్రామానికి చెందిన ఎరుకలి సురేష్ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు.గ్రామ సర్పంచ్ నందిపాటి మల్లికార్జున్ సురేష్ కుటుంబానికి రూ.10 వేల నగదును అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొప్పుల అశోక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రామసహాయం అరవింద్ రెడ్డి, నందిపాటి ఉపేందర్, పదో వార్డు నెంబర్ దారమల శంకర్, గొర్రెపాటి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
