సీసీ రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి కృషి
సర్పంచ్ జక్కుల ఉప్పలయ్య యాదవ్, ఉపసర్పంచ్ చిమ్ముల నవీన్ రెడ్డి.
డోర్నకల్ నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే నిర్విరామ కృషి:యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు చిర్ర సతీష్ గౌడ్
నరసింహులపేట, అక్టోబర్ 03 (నమస్తే న్యూస్)
ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకుడు, నర్సింహులపేట మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ చిర్ర సతీష్ గౌడ్ అన్నారు.శనివారం గ్రామ సర్పంచ్ జక్కుల ఉప్పలయ్య యాదవ్, ఉప సర్పంచ్ చిమ్ముల నవీన్ రెడ్డితో కలిసి గ్రామంలో పర్యటించిన సతీష్ గౌడ్.. డ్రైనేజీ, మురుగునీరు నిలిచే ప్రాంతాలు, పారిశుద్ధ్య సమస్యలను పరిశీలించారు.
గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవస్థానం, పీర్ల కొట్టం, బతుకమ్మ ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం అవసరాన్ని సర్పంచ్, ఉప సర్పంచ్ ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన సతీష్ గౌడ్.. సమస్యలను ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ దృష్టికి తీసుకెళ్లి, సీసీ రోడ్ల నిర్మాణానికి అవసరమైన సహకారం అందేలా కృషి చేస్తానని తెలిపారు.గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని, ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు ఇంకా అవసరమైన పనులను గుర్తించి దశలవారీగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని సతీష్ గౌడ్ పేర్కొన్నారు.సర్పంచ్, ఉప సర్పంచ్ తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి కచ్చితంగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధిలో ప్రజలు, పాలకవర్గం, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వెంకన్న, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహబూబ్ బాషా, వార్డు సభ్యులు హెచ్. యాకయ్య, గ్రామస్తులు అర్వపల్లి చిర్ర మధు, పాతూరు సందీప్ రెడ్డి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.


