నూతన గ్రామ శాఖ అధ్యక్షుడి గా గోగు హరిప్రసాద్ యాదవ్
రామన్నపేట అక్టోబర్ 2(నమస్తే న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో మాజీ సర్పంచ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గంపల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గ్రామ శాఖ ఎన్నిక జరుగగా నూతన గ్రామ శాఖ అధ్యక్షుడిగా గోగు హరిప్రసాద్ యాదవ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది, ఇట్టి గ్రామ శాఖ ఎన్నికకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పున్న జగన్మోహన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి గంగుల రాజిరెడ్డి, పూస బాలకృష్ణ, జింకల ప్రభాకర్, బత్తుల కృష్ణ, శంబాల వెంకన్న, పిట్టల.వెంకట్ రెడ్డి,ఎండి అక్రమ్ హాజరై మాట్లాడుతూ, ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి తోడ్పడాలని ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఈ గ్రామం నుండి భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండదండ ఉంటుందని, మళ్లీ రాబోయే ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగిస్తుందని, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుని గా పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని పలు సూచనలు చేశారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు మద్దెపూరి ఐలయ్య యాదవ్, మాజీ ఎంపీటీసీ గోగు పద్మ సత్తయ్య యాదవ్, నూతన గ్రామ శాఖ గౌరవ అధ్యక్షులు వనం కిష్టయ్య, జెల్లా దత్తాద్రి,ఉపాధ్యక్షులు కునూరు రామచంద్రం, గుర్రం లక్ష్మణ్ బాబు, ప్రధాన కార్యదర్శి, గుంతకంట్ల గోవర్ధన్ రెడ్డి , కార్యదర్శులుగా మేడి నరసింహ, ఆవనగంటి ధనుంజయ, కోశాధికారి కనుకు మల్లేశం, సహాయ కార్యదర్శి రాపోలు సత్యనారాయణ, కమిటీ కార్యవర్గ సభ్యులు, గుంజే చంద్రం, మేడి స్వామి, రత్నం నరసింహ, గోగు రమేష్, నేరటి మల్లేశం, జెల్లా యాదగిరి తదితరులు, ఈ కార్యక్రమంలో గంపల జీవన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు కందగట్ల రాహుల్ యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు శిరబోయిన నవీన్ యాదవ్,వార్డ్ నెంబర్ గోగు సురేష్ యాదవ్, ఎన్ ఎస్ యు ఐ గ్రామ శాఖ అధ్యక్షులు కనుకు రాము, బొడ్డుపల్లి లింగయ్య, ఎండి ఇమామ్ సాబ్ తదితరులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా నూతన గ్రామ శాఖ అధ్యక్షుడు గోగు హరిప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ నాపై ఎంతో నమ్మకంతో గ్రామ శాఖ అధ్యక్షునిగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తానని ప్రతి కార్యకర్తకు అండదండగా ఉంటానని తెలుపుతూ తన ఎన్నికకు సహకరించిన బోగారం గ్రామ శాఖ నాయకులకు మండల కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

