జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఎం ధర్నా.. ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి. జహంగీర్
భువనగిరి, సెప్టెంబర్ 19 (నమస్తే న్యూస్):
సీపీఎం ప్రజా ప్రతినిధులకు అభివృద్ధి పనుల కోసం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.డి. జహంగీర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ.. ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు నిధులు అందకపోవడంతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సీపీఎం ప్రజా ప్రతినిధులకు పెండింగ్లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థలకు తగిన నిధులు కేటాయించి గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి అవకాశం కల్పించాలని నాయకులు కోరారు. ప్రజా ప్రతినిధుల సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పనులు ముందుకు సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ధర్నాలో సీపీఎం నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

