రిపోర్టర్: పిల్లల మల్లికార్జున్
సెంటర్: బయ్యారం
దేశానికి ప్రమాదంగా మారిన మతోన్మాద భావజాలానికి వ్యతిరేకంగా పోరాడటం ద్వారానే అమరజీవి కామ్రేడ్ సీతారాం ఏచూరి కి అర్పించే నిజమైన నివాళులనీ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కుంట ఉపేందర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో వేజేశ్ళ సైదులు రావు భవనంలో సిపిఎం జాతీయ పూర్వ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ద్వితీయ వర్థంతి సభను నిర్వహించారు. మొదటగా ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. అనంతరం సిపిఎం మండల కార్యదర్శి నంబూరి మధు అధ్యక్షతన జరిగిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కుంట ఉపేందర్, జిల్లా కమిటీ సభ్యులు మండా రాజన్న ప్రసంగిస్తూ విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని జె ఎన్ యు కు , ఎస్ ఎఫ్ ఐ జాతీయ అధ్యక్షులగా పనిచేశారని తెలిపారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడంలో ధైర్యంగా నిలబడిన నేతయని, వామపక్షాల మద్దతుతో యుపిఏ ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారని, రాజ్యసభ సభ్యుడిగా విజయవంతంగా పనిచేశారని తెలిపారు. బిజేపి ప్రభుత్వం అవలంబించిన రైతాంగ, కార్మిక, వ్యవసాయ కూలీల, ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీలంగా పోరాడారని వివరించారు. అపర మేధావి, బహుభాషా వేత్త ఏచూరీ గారనీ, ఏచూరి గారి స్పూర్తితో దేశంలో మతోన్మాద భావజాలానికి, కార్పొరేట్ అనుకూల శక్తులకు వ్యతిరేకంగా పోరాడటంలో పార్టీ శ్రేణులు ముందుండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు అంగిరేకుల నాగేశ్వరరావు, తిరుపతిరావు, మెహన్, భిచ్చా, అప్పయ్య తదితరులు పాల్గొన్నారు.

