ఎస్సై కూచిపూడి జగదీష్
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 10 ( నమస్తే న్యూస్)
తిరుమలాయపాలెం మండలం లోని పిండిప్రోలు బీరోలు గ్రామపంచాయతీ కార్యాలయం నందు తిరుమలయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఇట్టి సదస్సులో గణేష్ ఉత్సవాల కమిటీ లో సభ్యులు ఎలాంటి నియమ నిబంధనలు పాటించవలనని తెలియజేయడం జరిగింది. అలాగే గణేష్ ఉత్సవాల కమిటీలో దేవుళ్ళనందు యువకులు ఎలాంటి మత్తు పానీయాలు తీసుకోకుండా జాగ్రత్త పడవలనని అలాగే విద్యుత్ విషయాల్లో కూడా అతి జాగ్రత్త వహించవలనని గణేష్ మండపాల వద్ద ఉండి లడ్డు అనేది ఉండటం జరుగుతుంది అట్టి విషయంలో ఉత్సవ కమిటీ లోని సభ్యులు జాగ్రత్తపడాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై కూచిపూడి జగదీష్ గ్రామ సర్పంచ్ గుమ్మడి దేవబిక్షం తిరుమలాయపాలెం స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు కానిస్టేబుల్ వీరస్వామి సర్దార్ రామ్మూర్తి దేవాదాయ చైర్మన్ కొత్తపల్లి సత్యనారాయణ రెడ్డి కాంగ్రెస్ ముఖ్య నాయకులు కొప్పుల రాంరెడ్డి ఎస్ కే జానీ బాబు గుమ్మడి శ్యాము చాగంటి ఉపేందర్ తెప్పలి రమేష్ గుండా నవీన్ రెడ్డి గంధం జానకి రాములు ఉల్లోజ్ రాము గంధం సుదర్శన్ వివిధపార్టీ నాయకులు గణేష్ ఉత్సవాల కమిటీ సభ్యులు యువకులు పెద్దలు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.


