తిరుమలాయపాలెం సెప్టెంబర్ 11 (నమస్తే న్యూస్)
మిరప లో వేరు కాండము కుళ్ళు నివారణకు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మిరప పంటలో వేరు మరియు కాండం కుళ్లు తెగులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. తెగులు నివారణకు థియోఫనేట్ మిథైల్ 70% WP శిలీంద్రనాశినిని లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున కలిపి ద్రావణాన్ని తయారు చేసుకోవాలి.
తెగులు సోకిన మొక్కలతో పాటు పక్కనే ఉన్న ఆరోగ్యకరమైన మొక్కల మొదళ్ల వద్ద నేల బాగా తడిచేలా ద్రావణాన్ని పోయాలి. దీనిని సాయిల్ డ్రెంచింగ్ (Soil Drenching) అంటారు.అలాగే పొలంలో తడి ఎక్కువగా ఉంటే తెగులు వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బిందు సేద్యం అందుబాటులో ఉంటే దాని ద్వారా నీటి తడుపులు ఇవ్వాలని సూచించారు.తెగులు కారణంగా పూర్తిగా దెబ్బతిన్న మొక్కలను వేర్లతో సహా తొలగించి పొలానికి దూరంగా పారవేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారని పాలేరు డివిజన్ ఉద్యాన అధికారి పీ అపర్ణ తెలిపారు.

