నర్సింహులపేట, సెప్టెంబర్ 10 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రూప్లా తండాకు చెందిన బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా నాయకుడు బానోతు కాలు నాయక్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా, బీజేపీ మండల అధ్యక్షుడు సూరబోయిన సతీష్ యాదవ్ గురువారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.ఈ సందర్భంగా కాలు నాయక్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సతీష్ యాదవ్, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, బీజేవైఎం మండల అధ్యక్షుడు పొడుపుగంటి అంజి, మండల ఉపాధ్యక్షుడు మెరుగు యాకయ్య, సత్యనారాయణరెడ్డి, బూత్ అధ్యక్షుడు బానోతు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

