మరణించిన సభ్యుల కుటుంబాలకు సహకార సంఘం భరోసా.
రైతు కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించిన చైర్మన్ .
రైతులకు వ్యవసాయ సేవలుతో పాటు, వారి కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తాము.
బండారి మల్లయ్య సింగిల్ విండో చైర్మన్ బయ్యారం.
మహబూబాబాద్ జిల్లా బయ్యారంల కేంద్రంలోని
రైతుల సంక్షేమం, వారి కుటుంబాలకు ఆపద సమయంలో అండగా నిలవడమే సహకార సంఘాల ప్రధాన లక్ష్యమని బయ్యారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సింగిల్ విండో చైర్మన్ బండారి మల్లయ్య అన్నారు. బయ్యారం మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సభ్యులుగా కొనసాగుతూ ఇటువలే మృతి చెందిన లక్ష్మీనరసింహపురం గ్రామవాసి మడిపెద్ది రామచంద్రు సభ్యుల కుటుంబాలు మడిపెద్ది కళమ్మ కి డీసీసీబీ ఖమ్మం వారి సౌజన్యంతో సంరక్షణ సంక్షేమ నిధి (గ్రూప్ ఇన్సూరెన్స్) ద్వారా రూ.1,00,000 (లక్ష రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ బండారి మల్లయ్య గారు మాట్లాడుతూ సహకార సంఘంలో సభ్యత్వం పొందిన రైతులు, వారి కుటుంబాలకు కష్టకాలంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు సంరక్షణ సంక్షేమ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, సభ్యులు అనారోగ్యంతో మృతి చెందిన సమయంలో వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడకుండా గ్రూప్ ఇన్సూరెన్స్ ద్వారా రూ.లక్ష ఆర్థిక సహాయం అందించడం కుటుంబానికి కొంతమేర భరోసాను కల్పిస్తుందని, రైతు కుటుంబాల్లో ఆపద సమయంలో సహకార సంఘం ఒక కుటుంబ సభ్యుడిలా అండగా నిలవాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నామని బండారి మల్లయ్య గారు తెలిపారు. రైతులకు వ్యవసాయ సేవలు అందించడంతో పాటు, వారి కుటుంబాల సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. అనారోగ్యంతో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన సమయంలో ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచిన డీసీసీబీ ఖమ్మం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బండారి మల్లయ్య గారికి డైరెక్టర్లకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కసనబోయిన శ్రీనివాస్ , గాడుదుల కేతమల్లు , అసిస్టెంట్ రిజిస్టర్ రమేష్ గారు, సహకార సంఘ కార్యదర్శి రేగళ్ల సురేందర్ గారు , స్టాఫ్ అసిస్టెంట్ గంట్ల అనూష, తుడుం రాజేష్ తదితరులు పాల్గొన్నారు…

