ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటాన్ని అడ్డుకోలేరు
బీజేపీ జిల్లా నాయకుడు అజ్మీరా రాము
రిపోర్టర్: పిల్లల మల్లికార్జున్
సెంటర్: గార్ల
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా హౌస్ అరెస్టులు చేయడం అప్రజాస్వామిక చర్య అని బీజేపీ మహబూబాబాద్ జిల్లా నాయకుడు అజ్మీరా రాము ఆరోపించారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు పిలుపు మేరకు చేపట్టిన “చలో హైదరాబాద్” కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు తనను గార్లలోని స్వగృహంలో, అలాగే గార్ల మండలానికి చెందిన బీజేపీ నాయకులు, ఇల్లెందు నియోజకవర్గంలోని పలువురు బీజేపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా అజ్మీరా రాము మాట్లాడుతూ.. 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర తమదని పేర్కొన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించడం సిగ్గుచేటని అన్నారు.ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజా సమస్యలపై నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాయకూడదని రాము అన్నారు. పోలీసుల ద్వారా నిర్బంధాలు చేయించవచ్చేమో కానీ ప్రజా సమస్యలపై బీజేపీ చేస్తున్న పోరాటాన్ని మాత్రం అడ్డుకోలేరని పేర్కొన్నారు.అక్రమ అరెస్టులతో సమస్యలు పరిష్కారం కావు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే” అని అజ్మీరా రాము డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపిస్తూ, ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలని కోరారు.

