తెలుగుదేశం జిల్లా అడహక్ కమిటి సభ్యులు మాజీ ఇంచార్జ్ : కొండబాల కరుణాకర్
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 6 (నమస్తే న్యూస్ )
తిరుమలాయపాలెం గ్రామంలో ముదిరాజ్ ల వనభోజన కార్యక్రమం ఘనంగా జరిగింది అట్టి కార్యక్రమం లోతెలుగుదేశం నాయకులు పాల్గొని వారిని అభినందించారు ముదిరాజ్ కులపెద్దలు కొప్పెర జానకిరాములు , పోలెబోయిన ముత్తయ్య తదితరులు ఏర్పాటు చేసిన వనభోజన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు కొండబాల కరుణాకర్ పాల్గొని వారిని అభినందించారు పార్టీలకు అతీతంగా కుల సంఘ భోజనాలు జరపుకోవటం సంతోషంగ వుందని అన్నారు అన్ని కులాలో పేద మధ్యతరగతి వున్న వాళ్లు వున్నారని అలాగే ముదిరాజ్ కులం లో కూడ ఆర్ధిక స్ధోమత వున్నవారు పేద వారికి సహాయసహకారాలు అందించాలని కరుణాకర్ అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కర్ణాటి అశ్వనీకుమార్ , గ్రామశాఖ అధ్యక్షులు మల్లీడి నాగేశ్వరరావు , ఆళ్ల నరసింహరావు, మల్లీడి బాబురావు ముదిరాజ్ సంఘం నాయకులు తురక వెంకన్న , పంచాయతీ వార్డ్ సభ్యులు వారా నాగరాజు, లింగంపల్లి సురేష్ , సైదులు , లింగంపల్లి వీరన్న ముదిరాజ్ సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

