కాంగ్రెస్ హామీలు ఏమయ్యాయి..?
కరెంటు కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు
నరసింహుల పేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ భారీ నిరసన

నర్సింహులపేట,సెప్టెంబర్ 5 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా “సీఎం డాం డాం.. వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన” అంటూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ హాజరై ధర్నాలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీఎస్ రెడ్యానాయక్ మాట్లాడుతూ.. గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలను నెరవేరుస్తామని ప్రచారం చేసిన ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో చెప్పాలని ప్రశ్నించారు.“కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే విరిగిపోతుంది. గ్రామస్థాయి బీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామాల్లో కష్టపడి పనిచేసి ప్రజలకు వాస్తవాలను వివరించాలి” అని ఆయన పిలుపునిచ్చారు. కరెంటు కోతలతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి, రోజుకు నాలుగు గంటల వరకు విద్యుత్ కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. “అవ్వలు అన్నం వండుకునే సమయంలో కరెంటు తీస్తే ఎలా.. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కరెంటు కోతలు” అంటూ విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సైతం డీఎస్ రెడ్యానాయక్ ప్రస్తావించారు. విద్యా భరోసా ఇస్తామని చెప్పి దగా చేశారని, నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని, మహిళలకు స్కూటీలు ఇస్తామని చెప్పి మభ్యపెట్టారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను డబుల్ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.అలాగే రైతులకు బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్కరోజు కూడా బోనస్ ఇచ్చిన దాఖలాలు లేవని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి ప్రజలకు సమాధానం చెప్పాలని డీఎస్ రెడ్యానాయక్ డిమాండ్ చేశారు.ధర్నా కార్యక్రమంలో మలిదశ ఉద్యమకారుడు ఎండి కాజామీయా, బీఆర్ఎస్ మండల మైదాన్ దేవేందర్, బోడపాట్ల నరసయ్య, యువ నాయకులు బండి రమేష్ , సురేష్ నాయక్, మారపంగు వీరన్న, శ్రీశైలం, సత్తిరెడ్డి, గూగుల్ రవి, మాలోత్ బాలు నాయక్, నరసింహారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పటేల్ రామన్న, రాందాస్, మందుల యాకన్న, వంశీ, శ్రీను, వీరన్న, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు




