పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: మున్సిపల్ చైర్పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి
డోర్నకల్/మరిపెడ, సెప్టెంబర్ 01 (నమస్తే న్యూస్): మరిపెడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేపడుతున్న మంచినీటి పైప్లైన్ మరమ్మతు పనులను మున్సిపల్ చైర్పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. పాఠశాలలో తాగునీటి సరఫరా పరిస్థితిని పరిశీలించి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. విద్యార్థులకు నిరంతరం స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. పైప్లైన్ మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేసి, పాఠశాలలో మంచినీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచాలని ఆదేశించారు.విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా పాఠశాలలో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం అనంతరావు, షేక్ తాజొద్దీన్, అలువాల ఉపేందర్ ప్రజాపతి, గంధసిరి భిక్షపతి, చెన్నూరు మహేష్, ఉపాధ్యాయులు రామ్మోహన్, జనార్ధనాచారి, సుధ తదితరులు పాల్గొన్నారు.


