రిపోర్టర్: పిల్లల, మల్లికార్జున్
సెంటర్: బయ్యారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ మండల కేంద్రంలో కొమరం భీమ్ ఆదివాసీ సంఘాల సమన్వయ (JAC )కమిటీ తెలంగాణ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జేఏసీ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ ఉయక రవి, వైస్ చైర్మన్ పాయం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సెప్టెంబర్ 28న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆదివాసీ సమాజం, ఆదివాసీ సంఘాల నాయకులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఆదివాసీ సంఘాలు ఎవరికి వారుగా విడివిడిగా పోరాటాలు చేస్తే భవిష్యత్తులో ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలు, సంక్షేమ పథకాల ఫలాలను సాధించుకోవడంలో నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఆదివాసీ సమాజానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం అన్ని సంఘాలు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, కొమరం భీమ్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం మాత్రమే సమస్యలకు శాశ్వత పరిష్కారం కాదని, అవసరమైన సందర్భంలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో బలమైన ఉద్యమాలు చేపట్టి అధికారుల దృష్టికి ఆదివాసీల సమస్యలను తీసుకెళ్లాలని పరిష్కరించే విధంగా మన ఉద్యమ నిర్మాణాలు ఉండాలని వారన్నారు.ఆదివాసీలకు సంబంధించిన చట్టాల అమలు, సంక్షేమ పథకాల సాధన, నిరుపేద ఆదివాసుల భూముల సమస్యల పరిష్కారం, ఏజెన్సీ ప్రాంతాల్లో అనర్హుల వల్ల అన్యాయానికి గురవుతున్న ఆదివాసీ కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.అధికారుల కార్యాలయాల ముట్టడి వంటి ప్రజాస్వామ్య ఉద్యమాల ద్వారా ఆదివాసీల హక్కుల సాధనకు పోరాటాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.అదేవిధంగా ఆదివాసీ సంఘాల మండల, డివిజన్, జిల్లా కమిటీలతో సెప్టెంబర్ 3, 2026న పాలవంచలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదివాసీ సమాజం కోసం పనిచేస్తున్న అన్ని సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలను తెలియజేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు ధనసరి రాజేష్ ASP రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, సొందే మల్లు దొర ASP జిల్లా అధ్యక్షులు చెట్టు పెళ్లి శ్రీను జిల్లా నాయకులు ఆదివాసి సేన అరేం ప్రశాంత్ GSS రాష్ట్ర నాయకులు మరియు ఆదివాసి సంఘాల మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

