మృతుడి కుటుంబానికి 50 కిలోల సన్నబియ్యం అందజేత
నరసింహులపేట, ఆగస్టు 29 (నమస్తే న్యూస్):
నరసింహులపేట మండలం పడమటిగూడెం గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు హెచ్. రామతార (55) ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శించారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 50 కిలోల సన్నబియ్యాన్ని అందజేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. రామతార మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. గ్రామంలో ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా పార్టీ తరఫున తమ వంతు సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. భవిష్యత్తులోనూ బాధిత కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని పేర్కొన్నారు.
కుటుంబానికి అండగా ఉంటాం
పార్టీ కార్యకర్తలు, నాయకులు కేవలం రాజకీయ కార్యక్రమాలకే పరిమితం కాకుండా ప్రజలకు కష్టసుఖాల్లో అండగా నిలవాలని భావిస్తున్నామని నాయకులు తెలిపారు. గ్రామ ప్రజల సమస్యలు, ఆపద సమయాల్లో తమ వంతు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఎంపీటీసీ పాతూరి రమేష్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల యూత్ ప్రధాన కార్యదర్శి, పడమటిగూడెం గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు మంచాల శ్రీశైలం యాదవ్, 3వ వార్డు సభ్యుడు నాగిరెడ్డి సునీల్‌రెడ్డి, గ్రామ పార్టీ మాజీ అధ్యక్షుడు దారం వేదయ్య, చిమ్ముల వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాతూరి వెంకట్‌రెడ్డి, కుంభాల లింగయ్య, చిదిమిల్ల యుగేందర్, హెచ్. సైదులు, అలువాల యాకన్న, నాయిని ఉపేందర్, గ్రామ పెద్దలు చిర్ర యాకయ్య, ఎరనాగి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

