తిరుమలాయపాలెం ఆగస్టు 28 ( నమస్తే న్యూస్)
మాట్లాడుతూ దేశంలో మతోన్మాద శక్తులు పెట్రేగిపోతున్న ఈ సమయంలో పాసిజానికి వ్యతిరేకంగా కార్మికులు కర్షకులు పోరాడాల్సిన అవసరం ఉందని కార్యకర్తలను చైతన్యపరిచే విధంగా ఆగస్టు 29. 30 తేదీలలో ఖమ్మం రూరల్ మండలం ఎం వెంకటాయపాలెం గ్రామంలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. 1, భౌతిక వాదం_చారిత్రక పరిణామం అనే క్లాసుని కామ్రేడ్ గుర్రం అచ్చయ్య గారు 2. పార్టీ నిర్మాణం పని విధానం కామ్రేడ్ పోటు రంగారావు గారు.3. పార్టీ కార్యక్రమం కామ్రేడ్ ఎం అన్వేష్.4. సరుకు-శ్రమ-అదనపు విలువ కామ్రేడ్ ఆవుల అశోక్ కుమార్లు బోధిస్తారని అన్నారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవడం కోసం ఈ రాజకీయ తరగతులు నిర్వహిస్తున్నామని తిమ్మిడి హనుమంతరావు. వెంకటేశ్వర్లు అన్నారు.

