కొండ సముద్రం కట్టపై రహదారి పనులు పూర్తి చేయాలి.
సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్.
డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 25(నమస్తే న్యూస్).
మండల ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మండల ఉన్నతాధికారులకు సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి.అబ్దుల్ రషీద్ వినతిపత్రం సమర్పించారు.ఆర్థిక ఇబ్బందుల కారణంగా మండలంలో సగం నిర్మించి అసంపూర్తిగా ఆగిపోయిన గృహాలను ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు.అర్హులైన పేద కుటుంబాలకు గృహ నిర్మాణం పూర్తి చేసుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా మరిపెడ బంగ్లా మున్సిపాలిటీ పరిధిలోని కొండ సముద్రం కట్టపై అసంపూర్తిగా ఉన్న రహదారి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణం పేరుతో రహదారి పనులు నిలిచిపోవడంతో గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాగే కొండ సముద్రం రోడ్డుకు రెండు పక్కల వ్యర్థ పదార్ధాలు వేస్తున్నారని, వాహనాధారులు, భాటసారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ రహదారిపై కొత్తతండా,బోడతండా,కౌంసలి బోడు తండా తదితర ప్రాంతాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారని,రహదారి అధ్వానంగా ఉండటంతో విద్యార్థులు, రైతులు ,కూలీలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి,అసంపూర్తి గృహాలకు ఇందిరమ్మ పథకంలో అవకాశం కల్పించడంతో పాటు కొండ సముద్రం రహదారి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

