రిపోర్టర్: పిల్లల ,మల్లికార్జున్
సెంటర్: బయ్యారం
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో
మూడోసారి అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ పూరీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర మహోత్సవం దిగ్విజయంగా ముగిసింది. ఈ రథయాత్ర పర్వదినం సందర్భంగా నిర్వహించిన ఆధ్యాత్మిక బస్సు యాత్ర లక్కీ లాటరీలో విజేతలుగా నిలిచిన 30 మంది భక్తులు, యాత్రను అద్భుతంగా నిర్వహించిన కమిటీ సభ్యులను కట్టా రమేష్ నివాసంలో ఘనంగా సత్కరించారు.
కార్యక్రమ ముఖ్య అంశాలు7 రోజుల ఆధ్యాత్మిక యాత్ర: కమిటీ వారు ఇచ్చిన మాట కంటే ఎక్కువగా, ఏకంగా 20 ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శన భాగ్యాన్ని లక్కీ లాటరీ విజేతలకు కల్పించారు. ప్రయాణంలో నాణ్యమైన భోజనం, సౌకర్యవంతమైన సీటింగ్ అందించి, భక్తులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారు.యాత్రను విజయవంతం చేసిన రథయాత్ర నిర్వహణ కమిటీకి, అనుభవజ్ఞులైన డ్రైవర్లతో ప్రయాణాన్ని సురక్షితంగా పూర్తి చేసిన శ్రీ నాగసాయి ట్రావెల్స్ పెంటయ్య భక్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీరామదండు రమేష్ మాట్లాడుతూ… గార్లలో జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో అద్భుతంగా జరిగిందని కొనియాడారు. లక్కీ లాటరీకి సహకరించిన భక్తులకు, యాత్రను ముందుండి నడిపించిన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో లక్కీ లాటరీ విజేతలు (30 మంది భక్తులు), గ్రామ ప్రముఖులు , స్థానిక భక్తులు పాల్గొన్నారు.

