తిరుమలాయపాలెం ఆగస్టు 16 (నమస్తే న్యూస్ )
తిరుమలాయపాలెం మండలం లోని తిప్పారెడ్డిగూడెం గ్రామం లో గ్రామ సర్పంచ్ కుంభం ఉపేందర్ ఉప సర్పంచ్ పుసులూరి రమేష్ ఆధ్వర్యంలో ముత్యాలమ్మ బోనాల జాతరను గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలను నెత్తిన పెట్టుకుని అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
గ్రామంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ముత్యాలమ్మ అమ్మవారిని వేడుకున్నారు. జాతర సందర్భంగా గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది.

