మహబూబాబాద్, ఆగస్టు 15(నమస్తే న్యూస్ డెస్క్)
మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గారు, మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ గారు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రేషన్ డీలర్లు, తదితరులు పాల్గొన్నారు.


