డోర్నకల్/మరిపెడ,ఆగస్టు 15(నమస్తే న్యూస్).
మరిపెడ పట్టణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి.వేడుకలకు ప్రభుత్వ విప్-డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రాంచంద్రు నాయక్ ముఖ్య అతిథిగా హాజరైనారు.ఈ సందర్భంగా మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి,మండల తహశిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో క్రిష్ణవేణి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ వేణుగోపాల్ రెడ్డి,సొసైటీలో చైర్మన్ చాపల యాదగిరి రెడ్డి,ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుగులోత్ రవి నాయక్ లు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.అనంతరం స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను ఉద్దేశించి వారు మాట్లాడుతూ..దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది అమరవీరులు ప్రాణ త్యాగాలు చేశారని గుర్తు చేశారు.1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రాన్ని సాధించుకున్నామని,సాధించుకున్న రోజుకు గుర్తుగా ప్రతి సంవత్సరం గర్వంగా స్వాతంత్రం దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.స్వాతంత్ర్యం అంటే కేవలం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందడం మాత్రమే కాదని,ప్రతి పౌరుడు గౌరవంగా,స్వేచ్ఛగా జీవించే అవకాశం అని పేర్కొన్నారు.ఈ స్వాతంత్ర్య ఫలాలను ప్రతి గ్రామానికి,ప్రతి ఇంటికి తీసుకెళ్లడమే మనందరి బాధ్యత అన్నారు.విద్య,వైద్యం,రైతు సంక్షేమం,మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు.యువత దేశ అభివృద్ధిలో చురుకుగా పాల్గొని,అవినీతి రహిత సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేష్ రెడ్డి,వైస్ చైర్ పర్సన్ కాలం సునీత రవీందర్ రెడ్డి,టౌన్ అధ్యక్షులు పానుగోతు రాంలాల్,మున్సిపల్ కౌన్సిలర్లు,కో ఆఫ్షన్ సభ్యులు,ఎమ్మార్వో,ఎంపిడిఓ,కాంగ్రెస్ పార్టీ వార్డు కమిటీ అధ్యక్షులు,సీనియర్ నాయకులు,యువ నాయకులు,ఆర్పీలు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరై జాతీయ భావాన్ని చాటారు.పాఠశాల విద్యార్థుల దేశభక్తి నృత్యాలు,దేశభక్తి గీతాలు కార్యక్రమానికి మరింత శోభ చేకూర్చాయి.మరిపెడ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ సర్పంచ్ పంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.ప్రతి పౌరుడు దేశభక్తిని కలిగి ఉండాలని,దేశానికి సేవ చేసే గుణాన్ని యువకులు అలవాచుకోవాలని గ్రామ సర్పంచులు అన్నారు.

