రామన్నపేట ఆగస్ట్ 13 (నమస్తే న్యూస్ ):రామన్నపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో ఈ నెల 15 న జరుగబోయే భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు గురువారం వినూత్నంగా తమ పాఠశాల ప్రాంగణంలో భారత దేశ నమూనాను ప్రదర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలలో భాగంగా విద్యార్థులచే వినూత్నంగా నిర్వహించిన భారత దేశ నమూనా ప్రదర్శన పలువురిని విశేషంగా ఆకట్టుకుంది, వినూత్నంగా ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులను పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ బి. సురేష్, అకాడమిక్ డైరెక్టర్ జె. మణి అభినందించారు.

