రిపోర్టర్: పిల్లల మల్లికార్జున్
సెంటర్: బయ్యారం
బయ్యారం,ఆగస్ట్ 13(నమస్తే న్యూస్ )
బయ్యారం మండలం జగ్గుతండా గ్రామపంచాయతీలో సర్పంచ్ బొల్లి జయంతి అధ్యక్షతన రైతులకు పంటల మార్పిడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొని రైతులకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రాజు మాట్లాడుతూ…. వరి సాగు చేస్తున్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించి, ప్రస్తుత ఎల్నినో ప్రభావంతో నెలకొన్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, అధిక నీటి అవసరమయ్యే వరి పంటకు బదులుగా తక్కువ నీటితో సాగు చేసుకునే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.అనంతరం కూరగాయల సాగు చేస్తున్న రైతు పొలాన్ని సందర్శించారు. అక్కడ బెండ, మిరప మరియు మునగ పంటలను సాగు చేస్తున్న తీరును పరిశీలించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ కూరగాయలు, పప్పుధాన్యాలు మరియు ఇతర ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా పంటల వైవిధ్యాన్ని పెంపొందించుకోవాలని రైతులకు సూచించారు.ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక చేసుకొని, నీటి పొదుపుతో పాటు స్థిరమైన వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలని అధికారులు అవగాహన కల్పించారు.


