–మాంసం వండలేదని భార్యపై దాడిచేసిన భర్త.
-తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందిన భార్య.
వంట చేయలేదని భార్యను చంపిన దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండల పరిధి బూరుగుచెట్టు తండా జీపీలోని మాంజాతండాలో మంగళవారం రాత్రి మాంసం కూర చేయలేదని మాలోత్ కళావతి(38)ని భర్త బాలు తీవ్రంగా కొట్టడంతో మృతి చెందింది. మృతురాలి తల్లి లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్లు ఎస్సై నగేష్ తెలిపారు.కాగా తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

