Type Here to Get Search Results !

తల్లి పాలే పుట్టిన బిడ్డకు అమృతం!:

NAMASTHE NEWS 0

  • తల్లి పాలే పుట్టిన బిడ్డకు అమృతం!
  • ముర్రుపాలే ప్రకృతి ప్రసాదించిన తొలి టీకా.
  • ఐసిడిఎస్ పిఓ ఎం.ఎల్లమ్మ.




కారంపురి వెంకటేశ్వర్లు నేత.7893556455. అమృతమని,పుట్టిన వెంటనే బిడ్డకు అందించే ముర్రుపాలే ప్రకృతి ప్రసాదించిన తొలి టీకా అని మరిపెడ ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిణి ఎం.ఎల్లమ్మ అన్నారు. ఇవి అమృతంతో సమానమని ఆమె పేర్కొన్నారు.

శనివారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని హౌసింగ్ బోర్డు అంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఆగస్టు 1 నుండి 7 వరకు ప్రారంభించారు.ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు స్థానిక ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవితో కలిసి ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిడ్డ పుట్టిన మొదటి గంటలోపు ఇచ్చే పసుపు రంగు ముర్రుపాలు ఎంతో పవిత్రమైనవని తెలిపారు.ఇవి శిశువులో రోగనిరోధక శక్తిని పెంచి భవిష్యత్తులో డయేరియా,న్యుమోనియా వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా రక్షణ కవచంలా కాపాడతాయని వివరించారు.ఆరు నెలల వరకు బిడ్డకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అని పేరు పెట్టారు తేనె,నీరు పట్టించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.bతల్లులు ఎలాంటి మూఢనమ్మకాలను నమ్మకుండా ముర్రుపాలను బిడ్డకు పట్టించాలని కోరారు. ఆరు నెలల తర్వాత అదనపు పౌష్టికాహారంతో పాటు,కనీసం రెండేళ్ల వరకు తల్లిపాలు ఇవ్వడం వల్ల పిల్లల మేధోశక్తి,శారీరక ఎదుగుదల అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ వి.రాజ్యలక్ష్మి, ఏఎన్ఎం ఝాన్సీ,ఆశా కార్యకర్త లలిత, అంగన్వాడీ టీచర్లు జె.ఉమారాణి, రజిత, గర్భిణీ స్త్రీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System