Type Here to Get Search Results !

తెలంగాణ జేఏసీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా మందడి ఇజ్రాయిల్‌కు ఘన సన్మానం

NAMASTHE NEWS 0

  • తెలంగాణ జేఏసీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా మందడి ఇజ్రాయిల్‌కు ఘన సన్మానం
  • రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రామహాయం నరేష్ రెడ్డి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు 



తిరుమలాయపాలెం,ఆగస్టు 1 (నమస్తే న్యూస్)

తిరుమలయపాలెం మండలం సుబ్లేడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు మందడి ఇజ్రాయిల్ ఇటీవల నిర్వహించిన జేఏసీ సమావేశంలో తెలంగాణ జేఏసీ ఖమ్మం జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శనివారం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రామహాయం నరేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.మందడి ఇజ్రాయిల్ గత నాలుగు దశాబ్దాలుగా ప్రజాసేవలో విశేషంగా కృషి చేస్తూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం సేవలందిస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సుబ్లేడు సర్పంచ్ సాంగబత్తుల స్వాతి సుమన్ రెడ్డి, రఘునాధపాలెం సర్పంచ్ గండం చంద్రయ్యతో వారం వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీటీసీ నిమ్మల వెంకన్న,వనవాసం నరసింహారెడ్డి, నాగయ్య, బోడ రమేష్,భవ్ సింగ్,గంట రాజు ప్రతినిధులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Comments System