ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శిగా పుల్లూరి బాలరాజు నియామకం.
రిపోర్టర్, పిల్లలు నరసింహారావు
సెంటర్, బయ్యారం
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామానికి చెందిన పుల్లూరి బాలరాజును MRPS రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తున్నట్టు MRPS జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ MRPS నూతన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేదాసి మోహన్ ల ఆదేశాలమేరకు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ కోండ్ర ఎల్లయ్య మాదిగ ప్రకటించినారు. పుల్లూరి బాలరాజు గత 30 సం.ల నుండి MRPS సంఘం కోసం వివిధ హోదాలలో పనిచేసి దండోరా ఉద్యమంలో జాతి అభివృద్ధి కోసం పని చేసినారు. వారి పనిని గుర్తించిన రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర కార్యదర్శిగా నియమించింది. ఈ సందర్భంగా పుల్లూరి బాలరాజు మాట్లాడుతూ. నాపై నమ్మకంతో ఇంతటి బాధ్యతను అప్పగించిన మేడి పాపన్న, కేదాసి మోహన్, కోండ్ర ఎల్లయ్య మాదిగ గారికి కృతజ్ఞతలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో పుల్లూరి ప్రశాంత్, బాషిపంగు గురవయ్య,పందుల సిద్దు,పందుల తరుణ్, పుల్లూరి సాయి, కస్తాల అక్షయ్, చెరుకుపల్లి అశోక్, డేరంగుల రాంబాబు, తప్పెట్ల యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

