బేస్ లైన్ టెస్ట్ ని తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ద్వారా నిర్వహించండి
జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి- పెసర ప్రభాకర్ రెడ్డి.
రిపోర్టర్:దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం,జులై 3 (నమస్తే న్యూస్)
పాఠశాలల అకాడమిక్ సందర్శనలో భాగంగా తిరుమలాయపాలెం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బీరోలు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బీరోలుమరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బచ్చోడు స్కూల్స్‌ని సందర్శించడం జరిగింది. దీనిలో భాగంగా బీరోలు మరియు బచ్చోడు ప్రాథమిక పాఠశాలలోని ప్రీ ప్రైమరీ సెక్షన్లను సందర్శించి ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు చిన్నారుల సంరక్షణ పైన తగిన సూచనలు చేయడం జరిగింది.అదేవిధంగా పాఠశాల పిల్లలతో ఇంట్రాక్ట్ కావడం మరియు పరిసరాల పరిశుభ్రత, మంచి తాగునీటి వసతిని అందించాలని, హైజినిక్- శుభ్రమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని మరియు ఈ నెలలో బేస్ లైన్ టెస్టులు ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ద్వారా,ఉన్నత పాఠశాలలో ఫిజికల్ పేపర్ల ద్వారా నిర్వహించాలని సూచించడం జరిగింది. ఈ పర్యటనలో వారి వెంట మండల విద్యాశాఖ అధికారి బాబు ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉన్నారు.


