పరకాల నాగన్న ఆశయ సాధన కోసం పోరాడుదాం.
మాస్ లైన్ కార్యదర్శి బందెల వెంకయ్య.
తిరుమలాయపాలెం జూలై 12 (నమస్తే న్యూస్)
గోదావరి లోయ ప్రతిఘటన పోరాట నాయకత్వానికి తిరుమలాయపాలెం మండలం రాజారం గ్రామం కేంద్రంగా ఉండేదని అమరుడు కామ్రేడ్ మద్ది వెంకటరెడ్డి. కామ్రేడ్ కందాల నరసింహారెడ్డి నాగన్న ను ప్రోత్సహించారని విప్లవ విద్యార్థి సంఘం పిడిఎస్యు నాయకుడు అయిన ఎమర్జెన్సీలో నరాంతక వెంగళరావు ఎన్కౌంటర్లో మృతి చెందిన కామ్రేడ్ శ్రీపాద శ్రీహరి ఎన్కౌంటర్కు కొలత చెందిన కామ్రేడ్ పరకాల నాగయ్య ఆ తర్వాత సిపిఐ (ఎంఎల్) పార్టీ పూర్తి కాలం కార్యకర్తగా నిర్ణయం తీసుకున్నాడని కామ్రేడ్ రాయల సుభో చంద్రబోస్ కామ్రేడ్ మాధవరెడ్డి వెంకట్రామయ్య తదితరుల నాయకత్వం పార్టీలో కళా రంగంలో నిలదొక్కుకొని పార్టీ విప్లవ కళాకారులుగా నాగన్న అని సిపిఐ (ఎంఎల్ )మాస్ లైన్ ( ప్రజాపంథా) పాలేరు డివిజన్ కార్యదర్శి బందెల వెంకయ్య అన్నారు. ఆదివారం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) తిరుమలాయపాలెం మండల కమిటీ ఆధ్వర్యంలో రాయల వెంకటనారాయణ భవనం పిండిప్రోలు గ్రామంలో నాగన్న సంతాప సభ కు పోలే పొంగు ఉప్పలయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో అరుణోదయ నాగన్న అమరత్వానికి రెండు నిమిషాలు మౌనం పాటించి కామ్రేడ్ నాగన్న కలను అమ్ముకోవడానికి ప్రయత్నించలేదని సొంతానికి వాడుకోలేదని. విప్లవ కల అభిమానుల సత్కారాలను హుందాగా స్వీకరించారని పాటల పెద్దన్నగానే అమరత్వం పొందడం అరుణోదయ సంస్థకి తీరని లోటని వారన్నారు. పరకాల నాగన్న నుండి అరుణోదయ నాగన్న గా ఏలాంటి స్వార్థం లేకుండా పిలవబడిన ఏకైక కళాకారుడు నాగన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కంకణబద్ధులు కావాలని వెంకయ్య అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ( ఎంఎల్ )మాస్ లైన్ ఖమ్మం జిల్లా నాయకులు కమ్మ కోమటి నాగేశ్వరరావు. రేపాకుల శివలింగం. ఏఐపీకేఎంఎస్ ఖమ్మం జిల్లా కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు. అరుణోదయ నాయకులు నామ వీరభద్రం. గోకినపల్లి సరోజన. వెంకటస్వామి. సోమనపల్లి వెంకటేశ్వర్లు. రెంటాల యాదగిరి. రాథోడ్ మచ్చు నాయక్. వడ్లమూడి వెంకయ్య. మండల వెంకటేశ్వర్లు. పరిక పల్లి నరేష్. మీగడ సత్యం. బానోతు శంకర్. దొడ్డ వెంకన్న. మీగడ సైదులు. తోకల సీతారాములు. కత్తుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

