- జూలై 16 న రైతుల పక్షపాతి రాయల చంద్రశేఖర్ 2 వ వర్ధంతి నీ జయప్రదం చేయండి.
- మాస్ లైన్ నాయకుడు కమ్మ కోమటి నాగేశ్వరరావు.
రిపోర్టర్:దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం,జూలై 13 (నమస్తే న్యూస్ )
దేశంలో పాలకులు మారుతున్నారు కానీ రైతుల జీవితాలు మారటం లేదని అలాంటి రైతాంగం కోసం ఆహార్నిశలు శ్రమించి వారి హక్కుల కోసం జీవితాన్ని త్యాగం చేసిన ఆదర్శ రైతుల పక్షపాతి అమరుడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ రెండో వర్ధంతి సభ జూలై 16వ తారీఖున ఖమ్మం లో రామ నరసయ్య విజ్ఞానకేంద్రంలో జరుగుతుందని అఖిలభారత ఐక్య రైతు సంఘం ( ఏఐయుకేఎస్) తెలంగాణ రాష్ట్ర నాయకులు కమ్మ కోమటి నాగేశ్వరరావు అన్నారు.
సోమవారం జరిగిన సిపిఐ(ఎంఎల్ )మాస్ లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల నాయకురాలు గోకినపల్లి సరోజిని అధ్యక్షతన రాయల వెంకటనారాయణ భవనంలో సోమవారం జరిగిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన నాగేశ్వరావు మాట్లాడుతూ కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ రైతాంగ ఉద్యమంలో అఖిలభారత స్థాయి నాయకుడిగా ఉత్తర దేశ పర్యటన చేశారని. చరిత్రక మైన ఢిల్లీ సరిహద్దులో కొనసాగిన రైతాంగ పోరాటంలో పాల్గొని మూడు నల్ల చట్టాలను రద్దు చేసేంతవరకు చంద్రశేఖర్ పోరాటం ఆగలేదని నాగేశ్వరావు అన్నారు. కామ్రేడ్ చంద్రశేఖర్ అమరుడై 2026జూలై 16 కు రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఖమ్మం లో రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో రెండో వర్ధంతి సభను జరుపుకోబోతున్నామని సభను విజయవంతం చేయాలని కోరారు.ఎమర్జెన్సీ అనంతరం సిపిఎంఎల్ పార్టీ ఇచ్చిన పిలుపుని అందుకొని లీగల్. బహిరంగ అవకాశాలు రావడంతో రైతు కూలీ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా. రాష్ట్ర నాయకుడిగా సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ కేంద్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ గా స్థాయికి ఎదిగిన నాయకుడు మన మధ్య దూరం కావడం తీర ని నష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు రేపాకుల శివలింగం. పాలేరు డివిజన్ కార్యదర్శి బందెల వెంకయ్య. ఏఐపీకేఎంఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు. మాస్ లైన్ తిరుమలాయపాలెం మండల కార్యదర్శి సోమనపల్లి వెంకటేశ్వర్లు. డివిజన్ నాయకులు ఫుల్గుజ్జు వెంకటస్వామి. మీగడ సత్యం. వడ్లమూడి వెంకయ్య. మండల వెంకటేశ్వర్లు. దొడ్డ వెంకన్న. పోలే పొంగు ఉప్పలయ్య. తదితరులు. పాల్గొన్నారు.

