తిరుమలాయపాలెంలో 100 పడకల ఆస్పత్రి పనుల పరిశీలన.
సమస్యలపై సర్వే నిర్వహించిన సీపీఎం ప్రతినిధి బృందం.
తిరుమలాయపాలెం, జూలై 11 (నమస్తే న్యూస్): ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి పనులను శనివారం సీపీఎం మండల ప్రతినిధి బృందం పరిశీలించింది. అనంతరం ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలపై సర్వే నిర్వహించి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా అవసరమైన సౌకర్యాలను కల్పించాలని అధికారులను కోరింది.ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను మాట్లాడుతూ.. ప్రజల దీర్ఘకాల పోరాటాలు, ఉద్యమాల ఫలితంగానే 100 పడకల ఆస్పత్రి మంజూరై నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని అన్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి, ఆస్పత్రిని త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో ఎక్స్రే యూనిట్, ట్రామా కేర్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ వంటి అత్యవసర వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేయాలని కోరారు.అనంతరం ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను వివరిస్తూ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కృప ఉషశ్రీకి వినతిపత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యుడు పుల్లూరి నాగేశ్వరరావు, సర్పంచ్ కామల్ల సువార్త, బిగినాటి మంగతాయారు, మద్దినేని శ్రీనివాస్, కొమ్ము నాగేశ్వరరావు, పప్పుల ప్రసాద్, శాఖ కార్యదర్శి నిరుసుల వెంకటేష్, పూలబోయిన ముత్తయ్య, సోమపొంగు రాము, కుమ్ము శంకర్ తదితరులు పాల్గొన్నారు.



