అరుణోదయ నాగన్న సంస్మరణ సభ జయప్రదం చేయండి.
న్యూడెమోక్రసీ తిరుమలాయపాలెం మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్.
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం జూలై 12 ( నమస్తే న్యూస్)
అరుణోదయ నాగన్న సంస్మరణ సభ జయప్రదం కోరుతూ మండలంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న న్యూడెమోక్రసీ శ్రేణులు బచ్చోడు గ్రామంలో ప్రచార అనంతరం మాట్లాడుతున్న న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్ మాట్లాడుతూ కామ్రేడ్ నాగన్న విప్లవోద్యమంలో తన వంతు పాత్ర క్రియాశీలకంగా పోషించాడని బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశాడని యావత్ సమాజంలో కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు అందరిని తన బలగంగా చేసుకొని రెండు తెలుగు రాష్ట్రాలలో చెరగని ముద్ర వేసుకున్నాడని కామ్రేడ్ నాగన్న భౌతికంగా మరణించిన ఆయన పాటలు మాటలు కవిత్వం ప్రజలను తట్టి లేపుతుందని ఆయనను స్మరించుకుంటూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రేపు 13వ తారీకు నాడు తన స్వగ్రామం రాజారంలో సంస్మరణ సభ నిర్వహిస్తున్నామని ఈ సభకు పార్టీ కేంద్ర నాయకులు మాధవరెడ్డి అవునూరి మధు జేవీ చలపతిరావు ఝాన్సీ జిల్లా కార్యదర్శి బండారి ఐలయ్య తదితరులు పాల్గొని మాట్లాడుతారు సభను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులను వివిధ ప్రజాసంఘాల నాయకులను కోరుతున్నాం. సభలో అరుణ అరుణోదయ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి .ఈ కార్యక్రమంలో అరుణోదయ జిల్లా అధ్యక్షులు పోలెపొంగు నాగయ్య పార్టీ డివిజన్ నాయకులు గొర్రెపాటి వీరస్వామి ఆడపు నగేష్ బింగి శ్రీను రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

