- ‘రైతు ఆశీర్వాద సభ’కు భారీగా తరలిరావాలి.
- బచ్చోడు గ్రామ సర్పంచ్ నందిపాటి మల్లికార్జున్.
రిపోర్టర్ :దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం, జూలై 9 (నమస్తే న్యూస్)
నేడు మధిర నియోజకవర్గం చింతకాని మండలం జగన్నాథపురం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘రైతు ఆశీర్వాద సభ’ను విజయవంతం చేయాలని బచ్చోడు గ్రామ కాంగ్రెస్ నాయకులు రామసాయం అరవింద్ రెడ్డి, హరిత రెడ్డి. పేలుపు మేరకు ఆ గ్రామ సర్పంచ్ నందిపటి మల్లికార్జున్ గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భం గా సర్పంచ్ నందిపాటి మల్లికార్జున్ మాట్లాడుతూ రాష్ట్ర రైతాంగానికి రూ. 9 వేల కోట్ల ‘రైతు భరోసా’ నిధులను జమ చేసిన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ చారిత్రాత్మక సభకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ మంత్రి, వాకిటి శ్రీహరి తో పాటు పాలేరు నియోజకవర్గ శాసనసభ్యులు, తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు తెలిపారు.కావున మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచనల మేరకు పాలేరు పరిధిలోని , తిరుమలాయపాలెం, మండలం బచ్చోడు గ్రామ , నాయకులు ప్రజలు, రైతులను భారీ సంఖ్యలో సభా వేదికకు తరలివచ్చి సభను జయప్రదం చేయాలని సర్పంచ్ మల్లికార్జున్ విజ్ఞప్తి చేశారు.

