- పిండిప్రోలు జూనియర్ కళాశాలకు అనుబంధంగా ప్రభుత్వం కాలేజీ తోపాటు హాస్టల్ ను ఏర్పాటు చేయాలి.
- సిపిఐఎం మండలం కార్యదర్శి కొమ్ము శ్రీను.
- జూనియర్ కళాశాల స్కూళ్లను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్న సీపీఎం ప్రతినిధి బృందం.
రిపోర్టర్: దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం,జూన్ 3 (నమస్తేన్యూస్ )
తిరుమలాయపాలెం మండలంలో సిపిఐఎం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలను హాస్టల్లో కాలేజీలను సందర్శించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్వే నిర్మించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు పిండిప్రోలు జూనియర్ కళాశాల హై స్కూల్ ప్రైమరీ స్కూల్ లను సందర్శించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది ప్రధానంగా జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి వివిధ గ్రామాల్లో నుంచి వస్తున్నారు . కానీ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం లేకపోవడం వల్ల వేరే ప్రాంతాలకు వెళ్లి హాస్టల్లో చేరుతున్నారు దాని ఫలితంగా విద్యార్థినిల శాతం తగ్గిపోతున్నారు తిరుమలాయపాలెం మండలంలో 40 గ్రామపంచాయతీలు 76 గ్రామాలు 18 గ్రామపంచాయతీ తండాలు ఉన్నందున దళిత గిరిజనులు పేదలు ఎక్కువగా ఉన్న మండలం కాబట్టి కాలేజీ హాస్టల్ ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇప్పటికైనా మంత్రి చొరవ తీసుకొని పిండిప్రోలు లో కాలేజీ మరియు హాస్టల్‌ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు అట్లాగే భోజనం చేయటానికి డైనింగ్ హాల్స్ లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని కాలేజీ టైముకు బస్సులు రాకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని కాలేజీ టైం కు బస్సులు నడపాలని ఆయన డిమాండ్ చేశారు మండల వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో సిపిఎం సర్వే నిర్వహిస్తుందని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ఆయన అన్నారు సిపిఎం బృందాలు అన్ని ప్రభుత్వ స్కూల్స్ హాస్టల్స్ సందర్శిస్తాయని ఆయన తెలిపారు యొక్క కార్యక్రమంలో సర్పంచ్ కామల్ల సువార్త సిపిఎం డివిజన్ కమిటీ సభ్యురాలు వేగునాటి మంగతాయి శాఖ కార్యదర్శి దొడ్డ లింగస్వామి పప్పుల ప్రసాద్ రామనబోయిన రవి తదితరులు పాల్గొన్నారు.

