నత్తనడకన సాగుతున్న “సర్” జనాభా గణన ప్రక్రియ.
ఓటర్లందరికీ అందని “సర్” ఫారాలు
“సర్” ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వరా..!?
గడువులోగా లక్ష్యాన్ని చేరడం అసాధ్యమే.
తొర్రూరు,జూలై 08 (నమస్తే న్యూస్)
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనాభా గణన ప్రక్రియలో భాగంగా ఓటర్లకు ఇస్తున్న “సర్” ఫారాలు ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా అధిక శాతం ఓటర్లకు అందలేదని, క్షేత్ర స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా “సర్” ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వరా? అని ప్రజలందరూ అడుగుతున్నారని, ఈ ప్రక్రియ నత్తకు నడక నేర్పినట్లుగా ఉందని సామాజికవేత్త దొనికెన కుమారస్వామి అన్నారు. తొర్రూరు మున్సిపాలిటీ మరియు మండల పరిధిలోని పలు వార్డులు, గ్రామాల్లో ఇట్టి విషయ పరిశీలన కోసం ప్రాథమికంగా మూడు రోజులు పర్యటించిన దొనికెన తాను సేకరించిన సమాచారాన్ని బుధవారం నాడు మండల పరిషత్ మీటింగ్ హాలులో జరుగుతున్న “సర్” సమీక్షా సమావేశంలో విజ్ఞాపన పత్రంగా స్థానిక ఎమ్మార్వోకు అందించిన అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయబడి, సంబంధిత ఓటర్ల చేత సక్రమంగా నింపబడి, బీఎల్వోల చేత సేకరింపబడి, స్కాన్ ద్వారా నమోదు చేయడానికి గడువు ఈ నెల 24 చివరి తేదీ ఉండడం వల్ల, ఇందుకు ఇంకా రెండు వారాలే మిగిలి ఉన్నాయని, ఇప్పటికే రెండు వారాలు గడిచినా కనీసం 50 శాతం కూడా పూర్తి కాని ఫారాల పంపిణీతో ఈ కార్యక్రమం ఎంతవరకు విజయవంతం అవుతుందని సంబంధిత శాఖను ఆయన ప్రశ్నించారు.ఓటర్లకు సంబంధించిన గృహాలను ఇప్పటికే గుర్తించినా సంబంధిత సిబ్బంది సమన్వయలోపం వలననో “సర్” ప్రక్రియ లక్ష్యాన్ని చేరుకోలేకపోతుందని దొనికెన అన్నారు.అందుచేత ప్రజలంతా జాగరూకులై ఎవరి ఓటు వారి బాధ్యతే కాబట్టి ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ లో కానీ ప్లేస్టోర్ ద్వారా ECINET మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని కానీ కావలసిన పత్రాలను అప్లోడ్ చేసి ఎవరి ఓటును వారే నమోదు చేసుకోవాలని దొనికెన కుమారస్వామి సూచించారు.ఈ విషయంలో సందేహాల నివృత్తి కోసం 1950 టోల్ ఫ్రీ నెంబర్లో సంప్రదించవచ్చని,అలాగే ఈ మెయిల్ complaints@eci.gov.in ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని లేదా Election Commission Of India, Nirvachan Sadan, Ashoka Road, New Delhi – 110001 పోస్టల్ అడ్రస్ ద్వారా కూడా ఎలక్షన్ కమిషన్ ను సంప్రదించవచ్చని సూచించారు.”సర్” ప్రక్రియలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమీషన్ దే నని వెతికితే ఎంతటి ఝటిల సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి “సర్” సమస్యల పరిష్కారానికి వీలైనంత త్వరగా తగిన చర్యలు తీసుకొనుటకు సంబంధిత యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని లేదంటే గడువును పెంచే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు.

