- హెల్మెట్ ధరించండి..ప్రాణాలను కాపాడుకోండి:ఎస్సై వెంకన్న
- రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలి.
- ప్రమాదం జరిగేది వ్యక్తికి కాదు…ఒక కుటుంబానికి.
![]() |
| కౌసల్యాదేవిపల్లి గ్రామంలో బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎస్సై వెంకన్న |
నర్సింహులపేట, జూలై 13 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ఆదేశాల మేరకు నర్సింహులపేట మండలంలోని కౌసల్యాదేవిపల్లి, జయపురం గ్రామాలలో సోమవారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సింహులపేట ఎస్సై బానోతు వెంకన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ద్విచక్ర వాహనదారులతో కలిసి ప్రత్యేక బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై వెంకన్న మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ ప్రమాదరహిత ప్రయాణానికి సహకరించాలని సూచించారు.అలాగే గ్రామంలో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. సమాజానికి హానికరమైన గంజాయి, గుడుంబా వంటి మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, గ్రామాన్ని వ్యసన రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు.



