సూర్యాపేట ,అక్టోబర్ 05(నమస్తే న్యూస్)
సూర్యాపేట పట్టణ మున్సిపల్ పరిధిలోని
43 వ వార్డులో ఈరోజు సోమవారం నాడు సిసి రోడ్ మరియు మురికి కాలువ నిర్మాణానికి పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ నివేదిత లక్ష్యాధి, వైస్ చైర్మన్ షఫీ ఉల్లా మరియు కౌన్సిలర్ బత్తుల ఝాన్సీ లక్ష్మీ రమేష్ శంకుస్థాపన గావించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వార్డులో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుందామని టౌన్ అభివృద్ధికి అందరం కలిసి సహకరించాలని మాట్లాడారు. కౌన్సిలర్ బత్తుల ఝాన్సీ లక్ష్మి రమేష్ మాట్లాడుతూ వార్డులో కొంచెం నీటి సమస్య అధికంగా ఉందని ప్రతి ఇంటి వారు బోర్లు వేయించుకోవడం జరిగిందని అయినా కూడా బోర్లు ఫుల్లుగా సక్సెస్ కాకపోవడం లేదన్నారు. నీటి ఎద్దడి ముందు కాలంలో చాలా ఎక్కువగా ఉంటుందని దాన్ని అధిగమించడానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని చైర్మన్ కి విన్నవించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వేణుగోపాల్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు బత్తుల రమేష్, వార్డు నాయకులు శంకర్, రవి, వెంకన్న, బాలస్వామి, రాణి, బద్దం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
