ప్రతి ఇంటికీ మంచినీరు అందించడమే లక్ష్యం
నర్సింహులపేటలో పైప్లైన్ పనులు ప్రారంభం
నర్సింహులపేట, అక్టోబర్ 5 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో ప్రజల తాగునీటి సమస్యకు పరిష్కారం చూపే దిశగా మంచినీటి పైప్లైన్ పనులకు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రంలోని నీరుడు వెంకటమ్మ ఇంటి వద్ద నుంచి భారీ గంగయ్య ఇంటి వరకు మంచినీటి పైప్లైన్ ఏర్పాటు చేసేందుకు సోమవారం గ్రామ సర్పంచ్ పెద్దమాముల యాకయ్య, ఉప సర్పంచ్ కాస యాకయ్య ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా అవసరమైన చోట్ల పైప్లైన్ సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజల మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.

